Wednesday, September 3, 2014

రాగి ముద్ద


రాయలసీమ వంటకాల్లో రాగిముద్ద ఎంతో పేరు గాంచింది. రోజువారీగా ఒక్కపూటైనా ఈ రాగిముద్ద తినకుండా సీమ వాసులు ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ రాగిముద్ద ఐటమ్‌ సీమవాసులకు చాలా ఇష్టం.

కావలసిన పదార్ధాలు:
బియ్యం నూకలు	: 500 గ్రా.
రాగి పిండి		: 400 గ్రా.
ఉప్పు		: తగినంత

తయారు చేసే విధానం:
రాత్రి నూకలను నీళ్లలో వేసి నానపెట్టుకోవా లి. ఉదయం నానిన నూకలకు నీరు బాగా చేర్చి స్టౌ పై పెట్టి బాగా ఉడికించాలి. నూకలు బాగా ఉడికి జావలా అవుతాయి. తరువాత స్టౌ మీద నుండి గిన్నె దించి రాగి పిండిని బాగా కలపాలి. ఈ కలిపేటప్పుడు పిండి ముద్దలుముద్దలుగా ఉండకూడదు. మొత్తం రాగిపిండి జావలో కలిసిపోయి ముద్దగా అవతుంది. ఇపుడు రాగిముద్ద తయారైనట్లే. ఈ రాగి ముద్దను రాయల సీమవాసులు రుచికరమైన నాటుకోడి పులు సు, పొట్టేలు తలకాయమాంసం, మటన్‌ పులుసు, గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు. పల్లీల చట్నీలతో కలిపి తింటే ఆ రుచే వేరని సీమవాసులు ఆనందంతో చెప్తారు. 

No comments:

Post a Comment