Thursday, September 4, 2014

పేలాలతో వడియాలు




కావలసిన పదార్థాలు:
 జొన్నలు - 1 కప్పు, కారం - 1 టీ స్పూను, వాము - 1 టీ స్పూను, వేగించిన నువ్వులు - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత. 

తయారుచేసే విధానం:
 జొన్నల్ని 8 గంటలపాటు నానబెట్టి నీరంతా వడకట్టి కొద్దిసేపు ఆరబెట్టాలి. వీటిని కడాయిలో వేసి (మూత పెట్టి) సన్నని సెగమీద ఉంచితే పేలాలవుతాయి. తర్వాత ఒక పాత్రలో పేలాలు, కారం, వాము, నువ్వులు, ఉప్పు వేసి (కొద్దిగా) నీరు చిలకరిస్తూ కలపాలి. పేలాలు మెత్తబడ్డాక ఈ మిశ్రమాన్ని పిడికిట్లోకి ముద్దలా తీసుకుని పల్చగా వత్తి ఎండ బెట్టుకోవాలి. ఈ వడియాలు వాము, నువ్వులు పంటికి తగిలి ఎంతో రుచిగా అన్పిస్తాయి. 

No comments:

Post a Comment