Thursday, September 4, 2014

మజ్జిగ మిర్చి / ఊర మిరపకాయలు


కావలసినవి: 

బజ్జీ మిర్చి - అర కేజీ; పుల్ల పెరుగు - కేజీ; ఉప్పు - తగినంత; పసుపు- కొద్దిగా

తయారు చేసే విధానం:
మిరపకాయలను ఒకవైపు మాత్రమే గాటు పెట్టి గింజలు తీసేయాలి. పెరుగులో ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. గాటు పెట్టిన మిరపకాయలను మజ్జిగలో వేసి ఒకరోజు పూర్తిగా నాననివ్వాలి. మరుసటి రోజు, మిరప కాయలను పెరుగులో నుంచి తీసి, ప్లాస్టిక్‌ కవర్‌ మీద ఎండలో ఉంచాలి పెరుగును విడిగా ఎండబెట్టాలి. రాత్రి మళ్లీ ఆ మిరపకా యలను పెరుగులో వేయాలి.ఇలా రెండు మూడు రోజులు మిరపకాయలను, పెరుగును విడివిడిగా ఎండబెట్టాలి. నాలు గవరోజుకి పెరుగు పూర్తిగా ఇగిరిపో తుంది.మిరపకా యలను మాత్రం సుమారు ఎండిన మిరపకా యలను నూనెలో వేయించి, మామిడికా యపప్పు అన్నంలో తింటే రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment