రేగుపండ్లు - కప్పు, గోధుమరవ్వ - అరకప్పు
పాలు - గ్లాసుడు (250 ఎం.ఎల్)
నెయ్యి - 3 టీ స్పూన్లు, ఏలకుల పొడి - చిటికెడు
బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ - తగినన్ని
(నెయ్యి వేసి వేయించాలి)
బెల్లం - తగినంత
సన్నగా తరిగిన పచ్చికొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
తయారి
రేగుపండ్ల నుంచి గింజలు వేరు చేసి, గుజ్జు చేసుకోవాలి. ఈ గుజ్జును మిక్సర్‌జార్‌లో వేసి, మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
స్టౌ మీద పాన్ పెట్టి, నెయ్యి వేసి, మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.
పాలు వేడిచేసి, అందులో వేయించిన గోధుమరవ్వ పోసి ఉడికించాలి.
రేగుపండ్ల గుజ్జు వేసి, ఉడికిన తర్వాత ఏలకుల పొడి, కొబ్బరిముక్కలు, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ వేసి, మరికాస్త ఉడికించి దించాలి.
వేడి వేడిగా సర్వ్ చేసేటప్పుడు పైన రేగుపండ్ల ముక్కలతో అలంకరించుకోవాలి.
No comments:
Post a Comment