Thursday, September 4, 2014

బియ్యప్పిండి అప్పడాలు


కావలసినవి: 

బియ్యం - అరకిలో; నిమ్మకాయలు - 2 (పెద్దవి); ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 100 గ్రా.; ఇంగువ - చిటికెడు; జీలకర్ర - టీ స్పూను; బియ్యప్పిండి - 3 కప్పులు
తయారుచేసే విధానం: ఒకపాత్రలో నీరుపోసి స్టౌ మీద ఉంచి మరగనివ్వాలి. కడిగిన బియ్యం పోసి ఐదు నిముషాలు ఉడకనిచ్చి దింపేయాలి. నీళ్లు వడగట్టి తడి ఆరబెట్టాలి
స్టౌ మీద బాణలి ఉంచి అందులో ఆరిన బియ్యం కొద్దికొద్దిగా వేస్తూ వేయించితే, అవి రెట్టింపు సైజులో విచ్చుకుంటాయి. 

తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి, సన్నజల్లెడలో జల్లించాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఈ మూడిటినీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.పలుచని వస్త్రంలో వేసి నీటిని వడకట్టాలి. నిమ్మకాయల రసం కూడా తీసుకోవాలి. నీటిలో ఇంగువ వేసి నానినవ్వాలి. పెద్ద పాత్రలో పైన చెప్పిన వస్తువులన్నిటినీ వేసి మెత్తగా చేతితో అదుముతూ జిగురులా వచ్చేవరకు కలిపి రెండు మూడు గంటలు నాననివ్వాలి. పిండిని ఉండలుగా చేసుకోవాలి. అప్పడాల పీట మీద బియ్యప్పిండి చల్లి దాని మీద ఈ ఉండలు ఉంచి ఒత్తాలి. ఒకరోజు ఎండలో ఉంచి ఆరిన తరవాత ఎయిర్‌టెయిట్‌ కంటెయినర్‌లో నిల్వ చేసుకోవాలి.

No comments:

Post a Comment