Sunday, September 14, 2014

ఔషద మొక్కలు ... 2.అశ్వగంధ (యవ్వనంగా ఉంచే అశ్వగంధ)



 కేన్సర్‌పై జరిగిన పలు పరిశోధనలలో అశ్వగంధ అనే మొక్క కేన్సర్‌ వ్యాధి త్వరగా తగ్గడానికి, సహకారి ఔషధంగా ఉపయోగ పడుతున్నట్లు గమనించారు. అలాగే ఈ మొక్క కేన్సర్‌ కణాల పెరుగుదల రేటును గణీయంగా తగ్గించడమే కాకుండా, కేన్సర్‌పై రేడియేషన్‌ ప్రభావాన్ని పెంచడంతోపాటు, రేడియేషన్‌ వలన ఆరోగ్యకణాలకు కలిగే హాని నుంచి రక్షణ కలిగించినట్లు కూడా గమనించారు.

అశ్వగంది, రియోడియోలా రోసియా, రోకా వంటి మొక్కలు వయసుతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపకరిస్తున్నాయి. అశ్వగంధి అనే మొక్క ప్రకృతి ప్రసాదించిన వైద్య మొక్క. వయసును కప్పి పెట్టడానికి అవస్థలు పడేవారికి వరప్రసాదిని. సహజంగానే దీనికి మనిషిని యవ్వనంగా ఉంచే లక్షణాలు ఉంటాయి. 

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థకు ఇతోధికంగా దోహద పడుతాయి. మనిషిలోని ఆందోళన, ఆత్రుత, మానసిక వైరాగ్యాలను తగ్గిస్తుంది. అక్షనాళము, డెనడ్రాన్లను పెంపొందించి ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. 

No comments:

Post a Comment