రేగుపండ్లు - కప్పు
పచ్చిమిర్చి - 5
పచ్చికొబ్బరి - అర కప్పు
వెల్లుల్లి - 5 రెబ్బలు
అల్లం - చిన్న ముక్క
పుదీనా ఆకులు - 10
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు
- 2 టేబుల్ స్పూన్లు
పోపు కోసం...
మినప్పప్పు - టీ స్పూన్
జీలకర్ర, ఆవాలు - అర టీ స్పూన్
ఎండుమిర్చి - 2
కరివేపాకు - రెమ్మ, నూనె - 3 టీ స్పూన్లు
తయారి
శుభ్రమైన రేగుపండ్లను తీసుకొని, గింజలను వేరుచేసి, గుజ్జు తీసుకోవాలి. కడాయిలో టీ స్పూన్ నూనె వేసి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి.
వేయించి ఉంచుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, అల్లం, రేగుపండ్ల గుజ్జు, ఉప్పు... వీటిని రోట్లో/మిక్సర్‌జార్‌లో వేసి (మెత్తగా లేదా కచ్చాపచ్చాగా) రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి.
స్టౌ మీద కడాయి పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి, పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ పోపును పచ్చడిలో వేసి కలపాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి, రేగుపండ్ల పచ్చడి కలిపి తింటే రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment