Sunday, September 14, 2014

అపార్ట్‌మెంట్ ఇళ్లల్లో పెంచే మొక్కలు - ఔషదమొక్కలు 1.కలబంద (కలబంద మొక్కలో త్రిమూర్తులు )

సాధారణంగా 'కలబంద' మొక్కలు అడవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కొంతమంది ఇళ్లలో కూడా ఈ మొక్కలు కనిపిస్తుంటాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచకూడదని కొంతమంది అంటూ ఉంటారు. మరికొందరు ఆ మాటలను చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు కలబంద మొక్క మంచిదేనా ? దానిని ఇంట్లో పెంచడం వలన దోషం ఉంటుందా ? అనే సందేహాలు చాలామందికి కలుగుతుంటాయి.

అయితే కలబంద మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చనీ, దానివలన ఉపయోగాలే తప్ప నష్టాలైతే లేవని ఇటు ఆధ్యాత్మిక గ్రంధాలు ... అటు ఆయుర్వేద వైద్య శాస్త్రాలు చెబుతున్నాయి. కలబంద మొక్కలో త్రిమూర్తులు ఉంటారనీ ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతూ ఉంటే, అనేక రకాల వ్యాధులను నివారించడంలో అది ప్రముఖ పాత్రను పోషిస్తుందని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది.

ఇక కలబంద మొక్క ఉన్న ఇంటి ఆవరణలోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఎలాంటి దుష్ట శక్తులకి సంబంధించిన మత్రప్రయోగాలనైనా కలబంద మొక్క నిర్వీర్యం చేస్తుందని చెప్పబడుతోంది. ఇక దిష్టి ప్రభావాప్రభావానికి గురికాకుండా ఇది ఇంటిని కాపాడుతూ ఉంటుంది. కనుక కలబంద ఇంటి ఆవరణలో ఉండకూడదనేది కేవలం అపోహగానే భావించాలి. ఇటు ఆధ్యాత్మిక పరంగాను ... అటు ఆరోగ్య పరంగాను తులసి మొక్కలానే కలబంద కూడా మానవాళికి మహోపకారం చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment