Friday, September 5, 2014

రేగుపండ్లు పచ్చడి


రేగుపండ్లు - పావుకేజి, పచ్చిమిరపకాయలు - 5
కారం - టీ స్పూన్‌, జీలకర్ర - టీ స్పూన్‌, 
ఆవాలు - టీ స్పూన్‌, మినుములు - టీ స్పూన్‌, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, 
ఉప్పు - తగినంత,
నూనె - 3 టీ స్పూన్‌లు, కరివేపాకు - ఒక రెమ్మ
తయారీ:
- కళాయిలో టీ స్పూన్‌ నూనె వేసి పచ్చి మిర్చిని వేయించుకొని, పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలోనే మినుములు, జీలకర్ర, ఆవాలు విడివిడిగా వేపుకోవాలి. 
- వీటన్నింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి కొద్దిగా కారాన్ని కూడా కలుపుకోవాలి.
- రేగుపండ్లను కడిగి ఆరిన తర్వాత వాటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. దానికి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కారం మిశ్రమాన్నీ కలపాలి. అన్ని కలిసే విధంగా పైపైన దంచుకోవాలి.
- పొయ్యి మీద కళాయి పెట్టి మిగిలిన నూనెను వేసి దానికి తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు పెట్టుకోవాలి. ఈ తాలింపును పచ్చడిలో వేసి కలపాలి. అంతే రేగుపండ్ల పచ్చడి రెడీ..! దీనికి ఎలాంటి తడి తగలకుండా ఉంటే 10 రోజుల వరకూ నిల్వ ఉంటుంది.
దీనిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే.... మధ్యమధ్యలో తగిలే రేగుపండ్ల గింజలు.. ఆహా..! భలే రుచికరంగా ఉంటుంది లెండి!

No comments:

Post a Comment