Sunday, September 14, 2014

కలబంద - సాగు విధానము

కొన్ని ప్రాంతాలలో దీనిని "కూటి కలబంద" అని అంటారు. దీని శాస్త్రీయ నామము 'అలోవిరా'. 
ఇది ఎడారి మొక్క. నీటి వసతి లేకున్నా ఇది తట్టు కోగలదు. 
నీటి వసతి తో కూడ సాగు చేయ వచ్చు. నీటి వసతి తో సాగు చేస్తే దిగుబడి ఎక్కువ వుంటుంది. నీరు నిలవని అన్ని ప్రాంతాలలో దీనిని సాగు చేయ వచ్చు. 
దీని ఆకులు సుమారు ఒక అంగుళం మందం కలిగి కలిగి వుంటుంది. అందులో వుండే పారదర్శక పదార్థమే ఔషదాల కొరకు ఉపయోగిస్తారు. 
పిలకల ద్వార దీనిని ప్రవర్థనం చేయవచ్చు. దీని పెద్ద మొక్క చుట్టు అనేక పిలకలు వస్తాయి. వాడిని తీసి నాట వచ్చు. 
దీని ఆకులను గాని, ఆకుల మధ్యలోవుండే 'జెల్ ' పదార్థాన్ని వేరు చేసిగాని అమ్ముకోవచ్చు.
 దీనిని ప్రతి సౌందర్య సాధన ఉత్పత్తులైన సబ్బులు, ముఖానికి రాసుకునే క్రీములు మరియు అనేక రకములైన ఔషదాలలో ఉపయోగిస్తారు. దీని పెరుగుదల తక్కువ. నీటి వసతి కింద పెంచే టప్పుడు దీనిలో కూరగాయల పంటలను అంతర పంటలుగా వేసుకుంటే ప్రత్యేకంగా దీనికి ఎరువులు వేయ నవసరంలేకుండా పెరుగుతుంది. నీరు నిలవ వుండని అన్ని రకాల నేలలు దీనికి అనుకూలమె.

No comments:

Post a Comment