Thursday, September 4, 2014

ఊరు మెరప కాయలు

DSCN2839

వీటిని చల్ల మెరపకాయలు లేదా ఊరు మెరపకాయలంటాం.వీటిని కూడా భోజనం లో చేర్చేరు మనవాళ్ళు. పప్పుతో బాగుంటాయి. కారం తినడం మంచిదన్నారు.వీటిని పుల్లటి చల్లలో నానబెట్టి ఎండబెట్టి మళ్ళీ నానబెట్టి తయారు చేస్తారు. వీటిని కొద్దిగా మజ్జిగలో చింతకాయలు తొక్కి వేసిన దానిలో కూడా వేసి తయారు చేస్తారు. అవి మాత్రం కొద్దిగా పులుపు కారంగా ఉంటయి. పూర్తిగా చల్లలో వేసినవి కమ్మగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు

  • ఒక మాదిరి లావు ఉన్న పచ్చి మిరపకాయలు : 2 కేజీలు
  • పెరుగు : 1 లీటరు
  • ఉప్పు : తగినంత
  • పసుపు : కొద్దిగా
  • ఇంగువ : కొద్దిగా

తయారీ విధానం

1. పచ్చి మిరపకాయలను శుభ్రంగా నీటితో కడగాలి.
2. సన్నని పిన్ను తీసుకొని అన్ని మిరపకాయలకు గాటు పెట్టాలి. కొద్దిగా పాడైనవి ఉంటే తీసివేయాలి.
3. తరువాత ఒక లీటరు పెరుగును మరీ పల్చగా కాకుండా మజ్జిగలా చేసుకోవాలి.
4. మజ్జిగలో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా ఇంగువను వేసి బాగా కలుపుకోవాలి. (ఉప్పు సరిపడా మాత్రమే ఉండాలి, ఎక్కువైతే ఎండిన తరువాత మరీ ఉప్పగా ఉంటాయి.)
5. ఆ మజ్జిగలో మిరపకాయలను వేసి బాగా కలియతిప్పి, మూడు రోజులు నాననివ్వాలి.(ఈ మూడు రోజులలో రోజుకొకసారి తీసి తిరగ కలుపుతూ ఉండాలి, లేదంటే పాడైపోతాయి.)
6. మూడవ రోజు ఉదయం మిరపకాయలను విశాలమైన ప్లేటులో పోసి, ఎండ తగిలేలా ఆరపెట్టాలి, సాయంత్రము ఆ ఎండిన మిరపకాయలను తిరిగి అవే మజ్జిగలో వేసి నాన పెట్టాలి.
6. మూడవ రోజు ఉదయం మిరపకాయలను విశాలమైన ప్లేటులో పోసి, ఎండ తగిలేలా ఆరపెట్టాలి, సాయంత్రము ఆ ఎండిన మిరపకాయలను తిరిగి అవే మజ్జిగలో వేసి నాన పెట్టాలి.
8. ఇలా మిరపకాయలు ఆ మజ్జిగను బాగా పీల్చుకునే వరకు(అంటే ఒక్ 5,6రోజులకి మజ్జిగ బాగా తగ్గిపోతాయి.)ప్రతిరోజూ చేయాలి.
9. ఇక ఆఖరిగా మజ్జిగలో వేయడం మానేసి బాగా ఎండే వరకు 2 రోజులు ఎండలో ఉంచితే ఊరు మిరపకాయలు రెడీ అయినట్టే.
10. వీటిని పప్పులలో నంచుకొని తింటే చాలా బావుంటాయి.

No comments:

Post a Comment