Thursday, September 4, 2014

బియ్యం పిండి జంతికల వడియాలు

 సురుచి

కావలసిన పదా ర్థములు: బియ్యం పిండి, పచ్చిమిర్చీలు 12, జీలకర్ర 1 టీస్పూన్‌, వాము 1 టేబుల్‌స్పూన్‌, నువ్వులు 2 టేబుల్‌స్పూన్లు ఉప్పు సరిపడా.
తయారు చేసే విధానం: జీలకర్ర, పచ్చి మిర్చి మెత్తగా పేస్టు చేసుకుని ఓ ప్రక్కన పెట్టుకోవాలి. బి య్యం పిండిని నీళ్ళ లో కలుపుకుని పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో నీళ్ళలో ఉప్పు, జీలకర్ర మెత్తగా నూరిన పేస్టు, కలిపిన బియ్యం పిండి వేసి బాగా ఉం డలు కట్టకుండా పిండిని కలుపుతూ ఉం డాలి. అది దగ్గరగా ఉడికిన తర్వాత (చూడ్డానికి మనకు ఉప్మాలా కని పించాలి.) జంతికల దాంట్లో పిండి పెట్టి మనకు కావ లసిన ఆకారంలో వేసు కోవచ్చు.

No comments:

Post a Comment