Thursday, September 4, 2014

టమేటోలతో ఒడియాలు

 
కావలసిన పదార్థాలు:
టమేటోలు - 200 గ్రా., 
సగ్గుబియ్యం - పావు కేజీ, 
నీరు - 6 కప్పులు, 
ఉప్పు - రుచికి సరిపడా, 
కారం - 1 టీ స్పూను.

తయారుచేసే విధానం:

 టమేటోలను నీటిలో పావుగంట ఉడికించాలి. చల్లబడ్డాక తొక్క తీసి, మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచాలి. సగ్గుబియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టి నీరు వడకట్టాలి. నానిన సగ్గుబియ్యానికి 6 కప్పుల నీరు జతచేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఉప్పు, కారం, టమోటా గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని (పెద్ద) ప్లాస్టిక్ కవర్‌పై గుండ్రంగా పల్చగా పల్చగా వేసి బాగా ఎండనిచ్చి డబ్బాల్లో నిలువ చేసుకోవాలి. 

No comments:

Post a Comment