Thursday, September 4, 2014

బూడిద గుమ్మడికాయ అట్టు

కావలసిన పదార్ధాలు :
అర ముక్క బూడిద గుమ్మడి కాయ
ఒక చిన్న కప్ మినప్పప్పు
4  పచ్చి మిరపకాయలు
ఉప్పు తగినంత
నూనె తగినంత
విధానం :
ఒక 6  గంటల ముందు గుమ్మడి కాయని సన్నగా పొడుగ్గా తరుక్కుని .. ఉప్పు రాసి ఆ ముక్కలకి అలా వదిలెయ్యండి ..
కుదిరితే ఒక పల్చని గుడ్డలో కట్టి దాని మీద బరువైనది ఏదైనా పెట్టండి .. (అప్పుడు దాన్లోని నీరంతా పోతుంది)
అది కుదరని వాళ్ళు .. 6  గంటలు పోయాక శుబ్రంగా చేత్తోనే పిండచ్చు  ...
గుమ్మడికాయ తో పాటు మినప్పప్పు కూడా నానపెట్టుకుని పచ్చి మిరపకాయ కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి ..
ఇప్పుడు ఆ పిండి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు దీంట్లో కలపండి ..
ఉప్పు టేస్ట్ చూస్కుని .. సరిపోకపోతే .. కొంచెం కలపండి ..
ఇప్పుడు పొయ్య మీద పెనం పెట్టి .. కొద్దిగా నూనె వేసి పరిచి .. ఈ గుమ్మడికాయ పిండిని చేత్తో ఒక నిమ్మ కాయ సైజులో .. పెనం మీద పెట్టి లైట్ గా పరవండి ..
కొంచెం దళసరిగా ఉంటె బాగుంటుంది .. ఇప్పుడు చుట్టురా నూనె వేసుకుని .. బ్రౌన్ గా అయ్యేలాగా కాల్చండి .. కరకరలాడలి అన్నమాట ..
ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ..
అంతే సింపిల్ .. గుమ్మడికాయ అట్టు .. రెడీ ..
వేడి వేడి అన్నం లో నెయ్యి /నూనె వేసుకుని ఈ అట్టు తింటే అబ్బా .. సూపర్ అంతే

No comments:

Post a Comment