Thursday, September 4, 2014

గుజరాతీ పచ్చిమామిడి ఆవకాయ

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పచ్చిమామిడి కాయలు (రాజపురి రకం ) 1 కేజీ
  • మెంతులు 1 కప్పు
  • ఉప్పు 1 ½ కప్పు
  • కాశ్మీరీ కారం 1 ½ కప్పు
  • ఆవపిండి 2 టీస్పూ//
  • ఇంగువ 2 టీస్పూ//
  • నువ్వుల నూనె తగినంత

తయారీ విధానం

మామిడికాయల్ని కడిగి ఆరనివ్వాలి.
వాటిని అంగుళం సైజు ఆవకాయముక్కల మాదిరిగా కోయాలి. ముక్కలని కాసేపు ఎండనివ్వాలి.
ఒక కప్పు నువ్వుల నూనెను మరిగించాలి. అందులో మెంతిపిండి, ఆవపిండి, ఇంగువ వేసి, బాగా కలిపి, ఓ పెద్ద స్టీలు గిన్నెలోకి మార్చాలి.
ఇప్పుడు పై మిశ్రమంలో ఆవకాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
చివరగా ఓ పలుచని బట్టతో దీని మూతిని బిగించి కట్టాలి.
రెండు రోజుల తరువాత మరో రెండు కప్పుల నువ్వుల నూనెను వేయాలి. ఆపై దాన్ని జాడీలోకి మార్చుకోవాలి.
పచ్చడిమీద నూనె అంగుళం ఎత్తున తేలుతూ ఉండేలా చూసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

No comments:

Post a Comment