Thursday, September 4, 2014

బూడిద గుమ్మడికాయ వడియాలు 1


కావలసినవి:

బూడిదగుమ్మడికాయ (చిన్నది) - 1 (ముక్కలుగా తరుగుకోవాలి); పొట్టు మినప్పప్పు - అర కిలో; పచ్చిమిర్చి - 50 గ్రా.; ఉప్పు - తగినంత; ఇంగువపొడి - టీ స్పూను

తయారుచేసే విధానం:
ముందురోజు రాత్రి పప్పును నానబెట్టాలి. ఉదయాన్నే మినప్పప్పు పొట్టు తీయాలి.
నీళ్లు తక్కువగా పోసి పప్పును గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బాలి. మిర్చి, ఉప్పు, ఇంగువ మెత్తగా నూరి మినప్పిండిలో వేసి కలపాలి. పిండిని పెద్దపాత్రలోకి తీసుకోవాలి. బూడిదగుమ్మడి కాయ ముక్కలు వేసి బాగా కలిపి కావలసిన సైజులో ప్లాస్టిక్‌ కవర్‌ మీద పెట్టుకోవాలి. ఎండిన తరువాత వీటిని వేయించుకుని అన్నంతోపాటు తింటే బాగుంటాయి.

No comments:

Post a Comment