Monday, September 8, 2014

కిచెన్ గార్డెన్ లో చెర్రీ టమోటో పండించుట

ప్రస్తుతం వసంత కాలం. తర్వాత రాబోయేడి వేసవి కాలం. వేసవిలో గార్డెనింగ్ అంటే కొంత కష్టమే. వేసవిలో గార్డెనింగ్ మీద కొంత ఎక్కువ శ్రద్ద పెట్టాలి. లేదంటే మొక్కలు ఎండకు ఎండిపోయే అవకాశం ఉంది.
 వేసవిలో కొన్ని ప్రత్యేకంగా పెరుగే మొక్కలు కూడా ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకొని మీ గార్డెన్ లో నాటుకోవాల్సింటుంది. కొన్ని రకాలా వెజిటేబుల్ మొక్కలు కూడా మీ కిచెన్ గార్డెన్ లో బాగా పెరుగుతాయి. 

వేసవిలో చెర్రీ టమోటోల మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. మరియు చాలా ముద్దుగా చిన్న సైజులో ఉండే ఈ చెర్రీ టమోటోలు మీ కొచెన్ గార్డెన్ కు బాగా సూట్ అవుతాయి. ఈ మొక్కలను నిర్వహించే బాధ్యతలు మరియు టైమ్ కూడా చాలా తక్కువ పడుతుంది. కిచెన్ గార్డెన్ లో చెర్రీ టమోటో పండించుటకు చిట్కాలు

చెర్రీ టమోటోలను పెంచడం వల్ల పొంద ప్రయోజనం, ఈ మొక్కలకు ఒక ట్రెడిషనల్ గార్డెన్ అవసరం లేదు. నిపుణుల ప్రకారం చెర్రీ టమోటో పాట్స్ (కుంపట్ల)లోనే బాగా పెరుగుతాయంటారు. ఈవెజిటేబుల్ మొక్కకు మీడియంగా నీరు పడితే సరిపోతుంది. మరి మీరు కూడా ఈ చెర్రీ టమోటో మొక్కలను మీ కిచెన్ గార్డెన్ లో పెంచుకోవాలనుకుంటే, ఒక్కడ కొన్ని గార్డెనింగ్ టిప్స్ ఉన్నాయి. వాటని అనుసరిస్తే మీ పని సులభం అవుతుంది. 

మరి ఆ చిట్కాలేంటో ఒకసారి చూద్దాం.. విత్తనాలు నాటడం: గార్డెనింగ్ చిట్కాల్లో మొదటిది. చెర్రీ టమోటో విత్తనాలు నాటడానికి సాలిడ్ కంటైనర్ లేదా మట్టి కుంపట్లను(మీకు ట్రెడిషనల్ గార్డెన్ లేనట్లైతే)ఉపయోగించవచ్చు. 

కుంపటిలో మట్టి, ఎరువు వేసి తర్వాత 1/8అంగుళం లోతులో విత్తనాలను నాటాలి. ప్లేస్: చెర్రీ టమోటో విత్తనాలను కుంపటిలో నాటిన తర్వాత, ఆ కుంపట్లను సూర్యరశ్మి సరిగా పడే ప్రదేశంలో పెట్టాలి. 
మొలకు రావడం మొదలు పెట్టిన తర్వాత:

 విత్తనాలు మొలకెత్తడం ప్రాంభమైన తర్వాత పాటించాల్సిన ఒక కీలకమైన చిట్కా. విత్తనాలు ఒకటి లేదా రెండు అంగులా పొడవు పెరిగిన తర్వాత టేబుల్ ఫ్యాన్ కు దగ్గరలో ఒక 5 నుండి 10 నిముషాల సేపు అక్కడ కుంపట్లు పెట్టాలి ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. 
టేబుల్ ఫ్యాన్ నుండి వీచే గాలి వల్ల చెర్రీ టమోటో మొక్క చాలా బలంగా పెరుగుతుంది. 

3 వారాల తర్వాత చెర్రీ టమోటో గార్డెనింగ్ టిప్స్ ట్రాన్స్ ప్లాంటింగ్: మూడు వారాల తర్వాత చిన్న కుంపట్లలో నుండి పెద్ద కుంపటి లేదా కంటైనర్ లోకి చెర్రీ టమోటో మొక్కలను మార్చాలి. 
మీరు ఇలా మార్చినప్పుడు సహజంగా, నేచురల్ గా ఉన్న ఎరువులను వేయాలి. మరియు మీ చెర్రీ ప్లాంట్ కు ఇలా చేయడం మర్చిపోకండి. అలా మార్చినప్పుడు, వేర్లు బయటకు కనబడనియ్యకండి.

 చివరగా : చెర్రీ టమోటో ప్లాంట్ కు రెగ్యులర్ గా నీటిని పట్టాలి. కానీ నీటిని తగిమాత్రంలోనే పట్టాలి, ఎక్కువగా పట్టినా సమస్య ఏర్పడుతుంది. నీళ్ళు ఆకలు తాకితే, బ్యాక్టీరియా సోకుతుంది. కాబట్టి, తగిన మాత్రంలో నీరు పట్టాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment