Thursday, September 4, 2014

ఎండుమిర్చితో ఒడియాలు

 
కావలసిన పదార్థాలు:
మినప్పప్పు - 1 కప్పు, 
ఎండు మిర్చి - 5, 
మిరియాలు - పావు టీ స్పూను, 
శనగపప్పు - 1 కప్పు, 
వెల్లుల్లి రేకలు - 5, 
ఉప్పు - రుచికి సరిపడా.

తయారుచేసే విధానం:
 
ఒక పాత్రలో మినప్పప్పు, గింజలు తీసిన ఎండుమిర్చి, మిరియాలు, శనగపప్పు, వెల్లుల్లి వేసి, సరిపడా వేడి నీటిని చేర్చి 2 గంటలు నానబెట్టాలి. 
తర్వాత మెత్తగా రుబ్బి సరిపడా ఉప్పుని కలపాలి. ఈ మిశ్రమాన్ని పల్చని పొడిబట్టపై వడియాల్లా పెట్టుకుని పెళపెళమనేలా ఎండబెట్టుకోవాలి. 
మిగతా వడియాల్లా కాకుండా ఈ వడియాల రుచి కాస్త ఘాటుగా భిన్నంగా ఉంటుంది.

No comments:

Post a Comment