Monday, September 8, 2014

వంటింటి కూరగాయలు పెరటిలోనే..కిచెన్‌ గార్డెన్‌

ఆరోగ్యంగా జీవించడానికి శరీరానికి అవసరమైన సమతుల్యమైన ఆహారం కావాలంటే ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో కూరగాయల శాతం ఎక్కువగా వుండాలని పోష కాహార నిపుణులు సూచిస్తున్నారు. సగటున ప్రతి ఒక్కరికీ రోజుకు కనీసం 85గ్రాముల పండ్లు, 300 గ్రాముల కూరగాయలు అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కూరగాయల తో రోజుకు సగటున ఒకరికి కేవలం 120గ్రాముల మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న కూరగాయల ధరలు, నిత్యావసరాల ధరల తో చాలామంది పోషకాహారానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ కారణంగా.. శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక వ్యాధులు దాడి చేస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే.. పోషకాహారవిలువలున్న కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. వీటిని సాధ్యమైనంత వరకు ఇంట్లోనే పండించు కుంటే.. పెరిగిన ధరల ప్రభావం ఆరోగ్యంపై పడకుండా జాగ్రత్త పడవచ్చు. మరి నగరాల్లో, ఇరుకు ఇళ్లల్లో మొక్కలను ఎలా పెంచవచ్చో, ఇంటిల్లిపాదికి సరిపోయే కూర గాయలను, ఆకుకూరలను ఎలా పండించుకోవచ్చో.. తెలుసుకుందాం. . నగరాల్లో కిచెన్‌ గార్డెన్‌ పెంచాలన్న ఆసక్తి గలవారికి ప్రభుత్వం శిక్షణను, రాయితీలను కూడా అందిస్తొంది.
పోషకాహార విలువలు ఎక్కువగా వుండే కూరగాయాలను ఇంట్లోనే కూరగాయలను ఉత్పత్తి చేసుకోవల్సిన అవసరం ఎంతైన ఉంది. దీనికి ఇంట్లోని వృధాఅయ్యే నీటిని వాడుకోవచ్చు. తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలను పెంచుకోవడం వల్ల చీడను రాకుండా, ఒక వేళ వచ్చినా సులభంగా చెట్లకు పట్టిన చీడను తొలగించుకొనేందుకు వీలుగా ఉంటుంది. పైగా రసాయనాలను వాడం కాబట్టి కాలుష్యం ఏర్పడదు. ఇదెంతో క్షేమకరమైన విధానం కూడా ఎందుకంటే ఇలా ఉత్పత్తి ఆయ్యే కూరగాయల్లో మన ఆరోగ్యానికి భంగం కలిగించే ఎరువల అవశేషాలు ఈ కాయగూరల్లో ఉండవు.
కిచెన్‌ గార్డెన్‌ ఎక్కడ ఆరంభించాలంటే :
వంటింటితోట ఎక్కడ పెంచాలనే దానికి స్థలం ఎంపిక విషయంలో మనకు పరిమితమైన అవకాశం ఉంది. ఇంటి పెరటి స్థలమే అందరికీ చివరగా అందుబాటులో ఉండే స్థలంగా చెప్పాలి. ఎందుకంటే ఇంటిలోని వారంతా తమ ఖాళీ సమయాల్లో కూరగాయలపై తగినంత దృష్టి పెట్టడానికి వీలవుతుంది. పైగా వంటింటిలో నుంచి స్నానాలగదిలో నుంచి వృథాగా పోయే నీటిని ఈ తోటలకు సులభంగా మళ్లించవచ్చు. ఈ కిచెన్‌ గార్డెన్‌ ఎంత పరిమాణంలో ఉండాలీ అనేదానికెలాంటి నియమాలూ లేవు. ఐతే చదరంగా ఉండే దానికన్నా దీర్ఘచతురస్రాకారంగా ఉంటేనే మంచిది. అయితే పట్టణాల్లో పెరడు అన్నదే మాయం అయిపోయింది కాబట్టి, టెర్రస్‌పైన, బాల్కనీలలో కుండీలు ఏర్పాటుచేసి ఇంటికి కావల్సిన అన్నీ కూరగాయలకు కాకపోయినా.. ఆకుకూరలనైనా పండించుకోవచ్చు. మొక్కలు నాటడం
కొన్ని విత్తనాలు నేరుగా వేసేవి, మరికొన్ని నారు పోసి తర్వాత విత్తుకునేవి ఉంటాయి. బెెండ, పందిరి చిక్కుడు, అలసందలు వంటి కూరగాయల విత్తనాలు నేరుగా విత్తవచ్చు. మిరుప, వంకాయ తదితర విత్తనాలను మడుల లో వేసి, మొలకెత్తిన తర్వాత కుండీల్లో నాటుకోవాలి. ఉల్లి, పుదీనా, కొత్తిమీర వంటి వాటిని చిన్నచిన్న మళ్లలో, ట్రైల్లో పెంచవచ్చు. దగ్గర్లో నర్సరీ ఉంటే నారుతో పెంచదగ్గ టామోటో, వంకాయ, మిరప వంటి వాటి తీసుకురావచ్చు. విత్తనాలను ఒక నెల రోజుల ముందే గీతలు గీసి విత్తుకోవాలి. అలా వేశాక వాటిపై మట్టివేసి , దానిపై 250 గ్రాముల వేప పిండిని కలిపితే, చీమలు విత్తనలును తినకుండా ఉంటాయి. నాటిన 30 రోజుల తరువాత టమాటో, 40 నుంచి 45 రోజులకు వంకాయ, మిరప, ఒక వేపుగా నాటాలి. టమోటా, వంకాయ, మిరప తదితర వాటిల్లో మొక్కకు మొక్కకు మధ్య 30,45 సెంమీ దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
నీటి అవసరం
మొక్కలు పెంచుకోవాలంటే.. నీళ్లు సమృద్ధిగా కావాలని చాలా మంది అనుకుంటారు. వర్షకాలంలో ఎక్కువగా నీరు అవసరం లేదు. కాస్తా నీటిని ఉపయోగించి.. మొక్కలను పెంచవచ్చు. మొక్కలను నాటగానే వాటికి నీళ్లు పోయాలి. ఆ తర్వాత మళ్లిd మూడోరోజు నీళ్లు పోయాలి. ఈ మొక్కలకు మొదట రెండు రోజులకోసారి. ఆ తర్వాత నాలుగురోజులకోసారి మాత్రమే నీళ్లు పోయాలి.
ఎక్కువ పోషకాలతో.. రసాయనాల ు లేకుండా ఏడాది పొడువునా కాయగూరలు పండించడమే కిచెన్‌ గార్డెన్‌ ప్రధాన లక్ష్యం. కొన్ని చిన్న చిన్న చిట్కాలను వాడి ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు.
ఇంటి వెనుక ఖాళీ స్థలం ఉన్నవాళ్లు.. ఏడాది పొడువునా నిరంతరం పెరిగే చెట్లను తోటకు వెనుక భాగంలో పెంచాలి. దీని వల్ల వాటి నీడ మిగిలిన మొక్కలపై పడకుండా నివారించవచ్చు. అలాగే మిగిలిన కాయగూర మొక్కలకు కావలసిన పోషకాహారాలను ఇవి లాగేసుకోకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. తక్కువ వ్యవధిలో పెరిగే కొత్తిమీర, పాలకూర, బచ్చలి, పుదీనా వంటి తక్కువ ఎత్తు పెరిగే మొక్కలను వేసుకోవచ్చు.
ఏడాది పొడువునా ఉం డేలా..
కరివేపాకు, దొండ తదితర కూరగాయలు కొన్ని సంవత్సరాల పాటు కాపునిస్తాయి. పెరటి స్థలం ఎక్కువగా ఉన్నవారు వీటిని పెంచుకోవచ్చు. కాస్తా పెద్ద కుండీల్లో వేసినా.. ఇవి ఎక్కువకాలం కాపునిస్తాయి.
గార్డెనింగ్‌ - ఆర్థిక లాభాలు
- కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటుచేసుకోవడంతో కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించుకోవచ్చు.
- రసాయనిక ఎరువుల ప్రభావం లేకుండా తాజా కూరగాయలద్వారా పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.
- గార్డెనింగ్‌ వల్ల రోజూ వ్యాయామం చేసినట్లు అవుతుంది. పచ్చనిచెట్ల నుంచి వచ్చే తాజా గాలి పీల్చే సౌలభ్యం కలుగుతుంది. అనారోగ్యసమస్యలు దరిచేయవు.
- కిచెన్‌ గార్డెన్‌లో పండేకూరగాయలు ఇంటి అవసరాలకు మించి ఉంటే వాటిని మార్కెట్‌ చేయడంతో కూడా ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
మొక్కలు నాటుకోవల్సిన సమయం..
వర్షాభావ పరిస్థితులను గమనిస్తూ.. ఏఏ మొక్కలు ఎపుడెపుడు వేసుకోవాలో తెలుసుకోవాలి.
కూరగాయల మొక్క పేరు సీజను
టమోటా, ఉల్లి ముల్లంగి బీన్సు బెండ జూన్‌,సెప్టెంబర్‌
వంకాయ, బీన్సు, టమోటా, తోటకూర జూన్‌, సెప్టెంబర్‌
మిరప, ముల్లంగి, అలసందలు, ఉల్లి(బళ్లారి) జూన్‌, ఆగస్టు
బెండ, ముల్లంగి, క్యాబేజి, గోరు చిక్కుడు జూన్‌, ఆగస్టు
ఉల్లి(బళ్లారి), బీట్‌రూట్‌, టమోటా, ఉల్లి జూన్‌, ఆగస్టు
గోరుచిక్కుడు, వంకాయ, బీటురూట్‌ జూన్‌, సెప్టెంబర్‌
ఉల్లి(బళ్లారి), క్యారెట్‌, గుమ్మడి(చిన్నది), పొద చిక్కుడు జూలై, ఆగస్టు
లబ్‌డబ్‌(పొద), ఉల్లి, బెండ, కొత్తిమీర, జూన్‌, ఆగస్టు

No comments:

Post a Comment