Wednesday, September 3, 2014

ఎగ్‌ పరోటా


కావలసిన పదార్థాలు:
పరోటా : రెండు
జీరా, ఉప్పు, మిర్చిపొడి : సరిపడా
రిఫైండ్‌ ఆయిల్‌ : సరిపడా
గుడ్లు : 2
సన్నగా తరిగిన ఉల్లిపాయ 
ముక్కలు : అరకప్పు
టమోటా ముక్కలు : అరకప్పు
మిరియాల పొడి : అర టీ స్పూను
ధనియాల పొడి : అర టీ స్పూను
పసుపు : పావు టీ స్పూను
కొత్తిమీర తురుము : రెండు టేబుల్‌ స్పూన్లు
తయారు చేసే విధానం:
ముందుగా కడాయిలో నూనె వేడి చేసి జీరా, ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి దోరగా వేగ నివ్వాలి. తర్వాత రెండు పరోటాల ముక్కలను వేసి వేయించాలి. మిర్చిపొడి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి వరుసగా వే సి సన్నని సెగపై ఉడికించాలి. గుడ్ల సొనను చిలి కి కడాయిలో పోసి కలపాలి. గుడ్లు పూర్తిగా ఉడకనిచ్చి పైన కొత్తిమీర తురుము చల్లి వేడి వేడిగా సర్వ్‌ చేయొచ్చు. ఎగ్‌ పరోటాకు చి ల్లీ సాస్‌ లేదా టమోటా సాస్‌ను సైడ్‌ డిష్‌గా సర్వ్‌ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment