Monday, September 8, 2014

ఇంటిపంట’లకు సబ్సిడీ.. అన్ని చోట్లా ఇవ్వొచ్చుగా!

..ఇప్పటి ట్రెండ్!
 ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి ‘సాక్షి’ స్వచ్ఛంద సంస్థల తోడ్పాడుతో ప్రారంభించిన కృషి ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. తత్ఫలితంగానే ఇంటిపంట కిట్లకు సబ్సిడీ ఇచ్చే పథకం ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యాన శాఖ సబ్సిడీపై ‘ఇంటిపంట’ ఉపకరణాల పంపిణీకి హైదరాబాద్‌లో గత ఏడాది మార్చిలో శ్రీకారం చుట్టింది. ఆర్‌కేవీవై నిధులతో 50% సబ్సిడీపై సిల్పాలిన్ మడులు, వేపపిండి, వేపనూనె, స్ప్రేయర్, సూటిరకం విత్తనాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌లో వచ్చే నెల నుంచి ఈ పథకం పునఃప్రారంభం కానుంది. పాలకులు ఇంటిపంటల ప్రాధాన్యాన్ని పెద్ద మనసుతో పట్టించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలకు ఇంటిపంట కిట్లు అందు బాటులోకి తేవాలని ‘సాక్షి’ కాంక్షిస్తోంది.

No comments:

Post a Comment