Wednesday, September 3, 2014

గ్రహ దోషాలను నివారించే ఉగాది పచ్చడి


ఉగాది అనే పదమే తెలుగు పదం. దీనికి ప్రకృతి యుగాది. చాంద్రమానం ప్రకారం ఏర్పడినదే ఈ ఉగాది.గ్రహాలలో చంద్రుడు సౌమ్యుడు. ఇతనిని మెతకవాడు అని కూడా కొందరు పిలుస్తారు. సౌరమాసం సూర్యుని గతిపై ఆధారపడిన మాసం. సూర్యుడు కాంతి విష యంలో తీవ్రమైన వాడు. ఈ నేపథ్యంలో ఉగాదిలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

girlయుగాది, ఉగాది ప్రకృతి వికృతులే. యుగమంటే జంట.సంఘజీవి మానవుడు జంట లేకుండా మనుగడ సాధించలేడు. అందుకే కాంలో జంటలను బాగా గుర్తించాడు. రాత్రి, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం, దక్షిణాయణం...ఇలా ఇంకా లోతుగా ఆలోచిస్తే పంచవార్గత్మక యుగంలో రెండు అధికమాసాలు. 60 సంవత్సరాల కాలంలో రెండు శనిచా రలు కనిపిస్తాయి. అలా యుగశబ్దం కాలవాచిగా రూపొంది కలియుగం, ద్వాపర యుగం మొదలైనవి ఏర్పడ్డాయి. 

యుగాది అంటే...
చరిత్ర శాస్తజ్ఞ్రులు, సాహిత్య పండితులు కూడా ఈ యుగ శబ్దాన్ని కాలవాచిగా ఉపయోగించారు. నన్నయ యుగం, గుప్తు యుగం ఇత్యాదులు ఈ కోవకు చెందినవే.మొత్తమ్మీద యుగాది అంటే కాల పరిగణనలో ఒక ఆరంభ కాలం. ఏ పనికైనా ఉత్తమ ఆరంభం.కార్యసిద్ధికి సంకేతం. వత్సరాది నాడు ఎంత శాతం కాలాన్ని ఆనందంగా గడపగలమో వత్సరమంతా ఆనందాన్ని అదే శాతంలో పంచుకుంటూ పెంచుకోవచ్చని సంప్రదాయం. 

పచ్చడి విశిష్టత...
ఉగాదినాడు ఉదయాన లేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి మరల మంగళస్నానం చేసి వస్త్రాభరణాలతో అలంకరించుకొని వినాయకుని, సరస్వ తిని, నవగ్రహాలను, దైవజ్ఞుని పూజించి పంచాంగ శ్రవణం చేసి వేపపుప్పు, పటిక, బెల్లం, మామిడి ముక్కులు, చింతపండు, నెయ్యి, అరటిపండు, చెరకు ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసి చేసిన వేప పుప్వు పచ్చడిని నివేదించి స్వీకరిం చాలని సంప్రదాయం.ఇది ఆరోగ్యరీత్యా చక్కని ఫలితాలనందించడమే కాకుండా గ్రహాలకు ఆధిపత్యం గల రుచుల మిళితం కావడం వలన గ్రహదోషాలను నివారించి సత్ఫలితాలను అందించడంలో కూడా సమర్థవంతమైనది. 

వేప పువ్వు ప్రత్యేకత...
Ugadi-ingredientsవేపపువ్వు రక్తాన్ని పరిశుద్ధం చేస్తుంది. రుతువుల మార్పు వల్ల శరీరంలో వచ్చే మార్పులకు శరీరం ఇబ్బంది పడకుండా కాపాడుతుంది. వేపపవ్వులోని చేదు ఆ వృక్షంలోని మౌలిక గుణాలన్నింటినీ తనలో ఇముడ్చుకొని శరీరంలోని వాత, పిత్త, కఫాలను సమ ప్రకృతిలో ఉంచే శక్తి కలిగి ఉంది. జ్యోతిశ్శాస్త్రంలో వాత, పిత్త, కఫాల సమ ప్రకృతి గలవాడు బుధుడు.పటిక బెల్లం గురునకు చెందిన ద్రవ్యం. ఇందులోని ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో చాలా మం దులకు దీనిని అనుపానంగా వాడతారు. గురుడు పూర్తి శుభగ్రహం కావడం వలన మంచివాడు.అందరితోను కలిసి మెలసి తిరుగుతూ అందరిలోని మం చిని వెలికి తీయగలవాడు అయినట్లుగా అన్ని ఔషధములలోని మంచి లక్షణా లను వృద్ధి పొందించే లక్షణం ఈ పటిక బెల్లంలో ఉంది. 

మామిడి ముక్కలు...
ugadi_pachadi1ఇందులో పులుపు, తీపి లక్షణాలుంటాయి. పులుపు శుక్రునిని ప్రతీక. శుక్రుడు సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది ఉపకరిస్తుంది. అం దులోని తీపి లక్షణం గురునికి చెందినది. వేసవి ఆరంభకాలంలో శరీరారో గ్యాన్ని కాపాడడం, అధిక శక్తిని శరీరానికి అందించడంలో మామిడి విశిష్టమై నది.చింతపండు హయగ్రీవునకు ప్రీతిప్రదమైనది. విశేషించి దీనికి అధిపతి శుక్రుడు. ఆలోచనాశక్తి పెంచడానికి, ఆరో గ్యానికి ఇది మేలు చేస్తుంది. వేసవిలో ఇం దులో ఉండే పులుపు ఆరోగ్యాన్నిస్తుంది.మా నసిక అనారోగ్యం కలవారికి చింతపండు తీవ్రమైన ఆలోచనను ఇంకా పెం చుతుందని వైద్యులు గుర్తించి వారికి దీనిని నిషేధిస్తున్నారు. 

నెయ్యికి అధిపతి చంద్రుడు. మనస్సును ఉత్తేజపరచడంలో నెయ్యి ప్రధాన పాత్ర వహిస్తుంది. అరటిపండు కూడా చంద్ర ప్రధానమైనదే. అరటిపండు శరీ రానికి అవసరమైన సమగ్ర పౌష్టికాహారాన్ని అందిస్తుంది.చెరకు కుజునికి సంబంధించిన ద్రవ్యం. రక్తశుద్ధికి, ఉత్తేజానికి ఇది ఉపకరిస్తుంది. కొబ్బరిరవి చంద్రుల లక్షణాలను కలి ఉంటుంది. రవి ఆరోగ్యానికి, చంద్రుడు మనశ్శాంతికి కారణం కావడం మానసిక ఆరోగ్యానికి ఇవి తోడ్పడుతాయి. ఇలా మన సంప్రదాయంలో పండుగులు, పర్వదినాలు గ్రహ గమనాలపై ఆధాపడి ఏయే కాలాల్లో వాడదగిన పదార్థాలు ఆయా శాతాల్లో వాడి శారీరక, మానసిక ఉత్తే జం పొందడానికి ఉపక రిస్తాయి. 

శ్రీకృష్ణుడి బోధనలు...
ugadiభగవద్గీతలో యుక్తాహార విహార స్య... అంటాడు శ్రీకృ ష్ణుడు. కాలానికి తగిన ఆహారం తీసుకుంటే దుఃఖాన్ని తొలగించుకొని ఆనందాన్ని పొందవచ్చని దాని అర్థం.జాతకంలో నడిచే దశకు అను గుణమైన ఆహారాన్ని స్వీరించి ఆరో గ్యాన్ని సమకూర్చుకునే వైద్య ప్రక్రియ జ్యోతిరెవైద్యం. ఏ కాలంలో పండే పంటలు ఆ కాలంలో స్వీక రించి ప్రకృతికి దగ్గరగా జీవించడం ప్రకృతి శాస్త్రం లోని ఆరోగ్య సూత్రం. మన పండుగలు ఈ అం శాలకు ప్రాధాన్యత ఇస్తూ శారీరక, మానసి కారోగ్యాలను వృద్ధి చేస్తున్నాయి. 

No comments:

Post a Comment