అప్పాలు
కావలసిన పదార్ధాలు
బియ్యపిండి .. ఒక గ్లాస్
గోధుమపిండి .. అర గ్లాస్
బెల్లం .. ఒకటిన్నర గ్లాస్
ఏలకుల పొడి .. ఒక చెంచా
నూనె .. అర కిలో
తయారుచేయు పధ్ధతి
ముందుగా బియ్యపిండి, గోధుమ పిండి ఒక బౌల్ లో వేసి కలిపి ఉంచుకోవాలి. ఒక పాన్ లో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసి అవి కాగాక అందులో బెల్లం పొడి వేసి కరిగాక అందులోఏలకుల పొడి వేసి కలిపి బియ్యపిండి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి ముద్దలాచేసి చల్లారాక నిమ్మకాయంత ఉండలు చేసి , ప్లాస్టిక్ కవరుకి నూనె రాసి అప్పంలా చేత్తో ఒత్తి పెట్టుకోవాలి. ఇంకో పన్లో ఆయిల్ వేసి బాగా కాగాక ఒత్తిన అప్పాలు నూనెలో వేసి ఎర్రగా వేయించాలి.
No comments:
Post a Comment