Friday, June 13, 2014

శనగపప్పు బర్ఫీ




శనగపప్పు బర్ఫీ


కావలసినవి :
శనగపప్పు - అర కప్పు
పాలు - అరకప్పు
నూనె - 1 టేబుల్ స్పూను
వెన్న - 2 టేబుల్ స్పూన్లు
యాలకులపొడి - 1 టీ స్పూను
పంచదార - అరకప్పు
మిల్క్‌పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
పిస్తా ముక్కలు - అరకప్పు

తయారీ : ముందుగా నూనె కలిపిన నీటిలో శనగపప్పుని నైట్  అంతా నానబెట్టి, ఆ నీళ్లతోనే ఉడికించి మెత్తగా చేసుకోవాలి. తరువాత కడాయిలో స్పూను వెన్న వేసి నిమిషం తర్వాత  పప్పు, పాలు, యాలకులపొడి వేసి కలిపి కలుపుతూ కొద్దిసేపు  ఉడికించాలి. తర్వాత పంచదార, మిల్క్‌పౌడర్, పిస్తా ముక్కలు వేయాలి. పంచదార పూర్తిగా కరిగాక వెన్న రాసిన ప్లేట్‌లో ఈ మిశ్రమం వేసి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి...

No comments:

Post a Comment