
Mango icecream
మ్యాంగో ఐస్‌క్రీమ్ కావలసినవి:
హోల్‌మిల్క్ - 500 ఎం.ఎల్
క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది) - 230 గ్రా.
పంచదార - 150 గ్రా.
మ్యాంగో పల్ప్ - 250 గ్రా.
స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా.
మ్యాంగో ఐస్‌క్రీమ్ తయారి:
మిల్క్ బాయిలర్‌లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి.
మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి.
ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి.
తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి.
ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది.
పాల మిశ్రమం చల్లారక మ్యాంగో పల్ప్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి.
ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టి, తర్వాత మామిడి పండు ముక్కలతో సర్వ్ చేసుకోవాలి.
No comments:
Post a Comment