Thursday, June 12, 2014

ప్లమ్ కేక్



ప్లమ్ కేక్ కావలసినవి: 
మిల్క్ మెయిడ్ - ఒక టిన్ను
మైదా - 200 గ్రా., వెన్న - 100 గ్రా.
బేకింగ్ పౌడర్ - టీ స్పూను
వంటసోడా - అర టీ స్పూను
బిస్లరీ సోడా - 125 మి.లీ.
డ్రైఫ్రూట్స్ (కాజు, బాదం, ఆక్రోట్, టూటీ ఫ్రూటీ, కిస్‌మిస్) - 150 గ్రా.
పంచదార - 6 టీ స్పూన్లు
నీళ్లు - 50 మి.లీ.

ప్లమ్ కేక్ తయారి:
కేక్ చేసే టిన్ను లోపల భాగమంతా వెన్న రాసి కొద్దిగా మైదాపిండి చల్లి గిన్నె అంతా పరుచుకునేలా కదపాలి. ఒక గిన్నెలో పంచదార కరిగించి ఎరగ్రా అయ్యాక అందులో పావు కప్పు నీళ్లు కలిపి క్యారమిల్ సిరప్ చేసి పెట్టుకోవాలి. మైదాపిండిలో వంటసోడా, బేకింగ్‌పౌడర్ వేసి రెండుసార్లు జల్లించాలి. వెడల్పాటి గిన్నెలో వెన్న కరిగించి మిల్క్‌మెయిడ్ వేసి బాగా కలపాలి. ఇందులో బిస్లరీ సోడా, మైదాపిండి మార్చిమార్చి వేస్తూ బాగా కలపాలి. చివర్లో క్యారమిల్ సిరప్, సన్నగా కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. వెన్న రాసి పెట్టుకున్న కేక్ టిన్నులో ఈ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి. ఓవెన్‌ను 180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టి ముప్పావుగంట బేక్ చేయాలి.  ప్లమ్ కేక్ ready

No comments:

Post a Comment