Thursday, July 10, 2014

ఫ్రూట్ సలాడ్

వేసవిలో కూల్ కూల్ ఫ్రూట్ సలాడ్ తో మజా చేయండి...
కావలసిన వస్తువులు:
 దానిమ్మ గింజలు : 1cup 
ద్రాక్షపళ్లు : 1cup 
పైనాపిల్‌ ముక్కలు : 1cup 
అరటిపండు ముక్కలు : 1cup 
చెర్రీ పండ్లు : 1/2cup 
మామిడిపండు ముక్కలు : 1cup 
ఆపిల్‌ పండు ముక్కలు : 1cup 
కమలాతొనలు : 1cup 
మిరియాలపొడి : 1/2tsp 
ఉప్పు : సరిపడినంత
 తేనె : 1/4cup 
నిమ్మ రసం : 2tsp 

తయారు చేసే విధానం: 
1. ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. 
2. తర్వాత ఈ పండ్ల ముక్కల మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటల పాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్‌ సలాడ్‌ రెడీ. 
3. ఇలా అయితే అన్ని రకాల పండ్లు తినవచ్చు. దీని వలన శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి.

No comments:

Post a Comment