Wednesday, July 9, 2014

ఆల్మండ్ (బాదంగింజలు) సూప్

ఆల్మండ్ సూప్

కావలసినవి: బాదంగింజలు - 20, కూరగాయలు ఉడికించిన నీళ్లు - నాలుగు కప్పులు, వెన్న - రెండు టీస్పూన్లు, మైదా - ఒక టేబుల్ స్పూన్, వేడిపాలు - ముప్పావు కప్పు, బాదం ఎసెన్స్ - నాలుగు చుక్కలు, ఉప్పు - రుచికి సరిపడా, తాజా మీగడ- రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - కొద్దిగా.
తయారీ: బాదం గింజల్ని వేడి నీళ్లలో పది నిమిషాలు నానబెట్టి పొట్టు తీయాలి. మూడు బాదం గింజల్ని పక్కన పెట్టి మిగతా వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఇలా చేసేటప్పుడు వైట్ స్టాక్ కొద్దిగా వాడొచ్చు. పక్కన పెట్టిన బాదం గింజల్ని సన్నటి ముక్కలుగా నిలువుగా కోసి ఒవెన్‌లో కరకరలాడేలా బేక్ చేయాలి. లోతైన నాన్‌స్టిక్ పాన్‌లో వెన్న వేడిచేసి మైదా వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ వేగించాలి. వేగించేటప్పుడు మైదా రంగు మారకుండా చూసుకోవాలి. బాదం పేస్ట్, మిగిలిన వైట్ స్టాక్‌ను ఇందులో వేసి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. తరువాత పాలు, బాదం ఎసెన్స్, ఉప్పు, మిరియాల పొడి కలిపి మరో ఐదు నిమిషాల పాటు సన్నటి మంట మీద ఉంచాలి. చివర్లో మీగడ వేసి కలిపి బేక్ చేసిన బాదం ముక్కలతో అలంకరించి తాగిస్తే చిన్నారులు ఎంతో ఇష్టంగా తాగుతారు.
కూరగాయలు ఉడికించిన నీళ్ల కోసం: బంగాళాదుంప, ఉల్లిపాయ, గుమ్మడికాయ, క్యాబేజిల తరుగు రెండు కప్పులు తీసుకుని అందులో ఐదు కప్పుల నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్‌లో మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఆవిరి పోయాక మూత తీసి మెత్తటి పేస్ట్‌లా చేసి వడకట్టాలి. దీన్నుంచి నాలుగు కప్పుల వైట్ స్టాక్ వస్తుంది

No comments:

Post a Comment