Wednesday, July 9, 2014

ఆలూ గోబీ


aloo-gobi
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ - 1, ఆలుగడ్డలు - 4, టమాటా - 1, పసుపు - ఒక టీ స్పూన్, కారం - అర టీ స్పూన్, కొత్తిమీర - పావు కట్ట, ధనియాల పొడి - ఒక టీ స్పూన్, ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
కాలీఫ్లవర్, ఆలుగడ్డలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి కాలీఫ్లవర్, ఆలుగడ్డలను వేసి వేయించాలి. పది నిమిషాల తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. మరో ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి. నోరూరించే.. ఆలూ గోబీ రెడీ!

No comments:

Post a Comment