దాల్ కచోరి
కావలసిన పదార్థాలు :మినపప్పు - ముప్పావు కప్పు గోధుమ పిండి - 4 కప్పులుపచ్చిమిర్చి - ఒకటి ఉప్పు - అరటీస్పూన్ సోంపు - టేబుల్ స్పూన్ ధనియాలు - టీస్పూన్ కారం - అరటీస్పూన్ ఇంగువ - పావుటీస్పూన్ నూనె - వేయించడానికి సరిపడా తయారుచేసే పద్ధతి:
- మినపప్పును రాత్రే నానబెట్టుకోవాలి.
- గోధుమపిండిలో తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకొని తడి బట్ట వేసి అరగంట సేపు నాననివ్వాలి.
- ఇప్పుడు మినపప్పులో ఉప్పు, కారం, ధనియాలు, సోంపు వేసి మెత్తగా రుబ్బాలి.
- గోధుమపిండిని నిమ్మకాయంత ముద్ద తీసుకొని చిన్న పూరీలా వత్తుకొని అందులో కాస్త పప్పు మిశ్రమాన్ని పెట్టి మూసేసి కచోరీలా వత్తాలి.
- ఇలాగే అన్నీ చేసుకొని కాగిన నూనెలో వేయించి తీసి చట్నీతో వడ్డించాలి.
No comments:
Post a Comment