Monday, July 7, 2014

బేల్ పూరి

Picture
కావలసిన పదార్థాలు
మరమరాలు - 100 గ్రాములు, 

టమాటాలు - 10 గ్రాములు, 
ఉల్లిగడ్డ - 1, 
కొత్తిమీర - 1 కట్ట, 
కట్టామీటా చట్నీ - టేబుల్‌ స్పూన్‌, 
కారం - 3 గ్రాములు, 
చాట్‌ మసాలా - 3 గ్రాములు, 
నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, 
సేవ్‌ - 20 గ్రాములు
ఉప్పు - తగినంత

తయారీ విధానం
  •  ఉల్లిగడ్డ, టమాట, పచ్చిమిర్చి బాగా సన్నగా తరగాలి.
  • ఓ గిన్నెలో కట్టామీటా చట్నీ, ఉప్పు, కారం, చాట్‌మసాలా కలపాలి.
  • అందులోనే మరమరాలు, తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిసేటట్టు తిప్పాలి.
  •  చివర్లో సేవ్‌, కొత్తిమీర తరుగు చల్లుకుంటే చాలు.

No comments:

Post a Comment