Wednesday, July 9, 2014

బార్లీ వెజిటబుల్ సూప్


కావలసినవి: 
నూనె - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ (సన్నగా తరిగి) - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి (సన్నగా తరిగి) - అర టీస్పూన్, కూరగాయలు ఉడికించిన నీళ్లు - నాలుగు కప్పులు, క్యారెట్ ముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు, టొమాటో గుజ్జు - మూడు టేబుల్ స్పూన్లు, టొమాటో తరుగు - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, బార్లీ ఉడికించి - రెండు టేబుల్ స్పూన్లు, మాకరోని ఉడికించి - మూడు టేబుల్ స్పూన్లు, పాలకూర తరుగు - పావు కప్పు, ఎండుమిర్చి తునకలు - అర టీస్పూన్.
అలంకరణకు: చీజ్ (తరిగి) - ఒక టేబుల్ స్పూన్
తయారీ: లోతైన నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడిచేసి ఉల్లిపాయ, వెల్లుల్లి తరుగు వేసి ఓ మాదిరి మంట మీద రెండు మూడు నిమిషాలు వేగించాలి. తరువాత కూరగాయలు ఉడికించిన నీళ్లు, క్యారెట్ ముక్కలు, టొమాటో గుజ్జు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఏడు నిమిషాలు సన్నటి మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత బార్లీ, మాకరోని వేసి కలిపి మరో నిమిషం ఉంచాలి. తరువాత స్టవ్ నుంచి గిన్నె దింపి ఎండుమిర్చి తునకలు వేసి బాగా కలిపి పైన చీజ్ తరుగు వేసి వేడివేడిగా తాగండి.
టిప్: బార్లీ, మాకరోని ఉడికించేందుకు ముందుగా ఒక గిన్నె నిండా నీళ్లు పోసి వేడిచేయాలి. తరువాత బార్లీ మాకరోనిలను అందులో వేసి పావుగంట ఉడికించాలి. వేడినీళ్లు తీసేసి బార్లీ, మాకరోనీలపై చల్లటి నీళ్లు పోసి వడకట్టి వాడాలి.

No comments:

Post a Comment