Wednesday, July 9, 2014

వెజిటబుల్ సూప్

శీతాకాలం వచ్చేసింది. సాధారణంగా ఈ కాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి రుగ్మతలు రావడమన్నది సాధారణం. వీటినుంచి రక్షించబడాలంటే వేడి వేడి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మిరియాలు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి ఇలాంటివన్నీ ఎక్కువగా వాడటం ఈ కాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శీతాకాలంలో వేడివేడి సూప్ తీసుకోవడం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
వెజిటబుల్ సూప్

కావలసిన పదార్థాలు..
1) కీర దోస
2) టమాట
3) ఉల్లిపాయలు
4) పచ్చిమిర్చి
5) ఉప్పు
6) మిరియాలు
తయారు చేసుకొనే విధానం..
   కీర దోస చెక్కుతీసి, ముక్కలుగా కట్ చేసుకోని గిన్నెలో వేసుకోవాలి. తరువాత టమాట ను కూడా అలాగే తినటానికి వీలుగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. వీటిపై మిరియాలను పైన వేయాలి. వాటిపైన కొంచెం ఉప్పు వేసి కావలసినంత నీటిని పోసి, స్టౌపై పెట్టి మరిగించాలి. ముక్కలు ఉడికిన తర్వాత స్టౌ పైనుండి దించేయాలి. వెజిటబుల్ సూప్ రెడీ. ఇక్కడ చెప్పిన కూరగాయలే కాక సొరకాయ, బీరకాయ, దోసకాయ వంటి కూరగాయలను కూడా ఈ సూప్ తయారీలో వాడుకోవచ్చు

No comments:

Post a Comment