Wednesday, July 9, 2014

పాలకూర సూప్

Picture  Recipe
తయారీ చేయుటకు పట్టు సమయం :
50 నిమిషాలు
కావలసిన పదార్థాలు సమకూర్చుకొనుటకు :
30 నిమిషాలు
వండుటకు :
20 నిమిషాలు
 


కావలసిన పదార్థాలు

  • పాలకూర. 800గ్రా
  • వెజిటబుల్‌ స్టాక్. 1 లీటర్ (వెజిటబుల్‌ స్టాక్‌ కోసం. గాజర్‌, బీన్స్, గోబీ పువ్వు, ఉల్లిపాయలు, మిరియాలు లీక్‌, సెలరీ, కరివేపాకు అన్నీ వేసి ఒక గంటసేపు ఉడికించాలి. )
  • ఉప్పు. తగినంత
  • తెల్లమిరియాల పొడి. రుచికి సరిపడా
  • మైదా. 50 గ్రా
  • వెన్న. 100 గ్రా
  • క్రీం. 15 గ్రా

తయారీ విధానం

పాలకూరను ఉడకబెట్టి మెత్తగా నూరుకోవాలి. ఒక బాణెలి తీసుకొని అందులో వెన్న వెయ్యాలి.
వెన్న కరిగిన తర్వాత అందులో మైదా వేసి వేయించాలి. ఆ తర్వాత అందులోనే పాలకూర పేస్ట్ వేసి వేయించాలి.
ఆ తర్వాత వెజిటబుల్‌ స్టాక్‌ పోసి సన్నని మంటపై 10 నిమిషాలు ఉడక నివ్వాలి.
చివర్లో తెల్ల మిరియాల పొడి చల్లి, తగినంత ఉప్పు వేసి, పైన క్రీం వేసి సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment