కావలసిన పదార్థాలు
- మామిడికాయ... 1 పెద్ద సైజుది
- బెల్లం... 90 గ్రా
- ఉప్పు... 1/2 టీస్పూ//
- పచ్చిమిరపకాయలు... 2
- బియ్యంపిండి... సరిపడా
తయారీ విధానం
మామిడికాయను పై పొట్టు తీయనక్కరలేదు. మరీ మందంగా ఉంటే మాత్రం తొక్క తీసుకోవాలి.
లీటరులో 5వ వంతు నీటిని వేడి చేసుకోవాలి.
అందులో ఈ మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
మామిడికాయ ఉడికిన తరువాత బెల్లం కలపాలి. ఆ తరువాత బియ్యంపిండిని నీళ్ళలో కలిపి అందులో పోయాలి.
రెండు టీ స్పూన్ల నూనెలో ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసి పోపు పెట్టుకోవాలి. అంతే మామిడికాయ పచ్చడి రెడీ. ఇది ఇడ్లీ, దోశెల్లోకి అద్భుతంగా ఉంటుంది.
No comments:
Post a Comment