Thursday, July 10, 2014

మష్రూమ్ మంచూరియా


కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు (మష్రూమ్స్)... 250 గ్రాములు
మైదా... 50 గ్రాములు
కార్న్‌ఫ్లోర్... 50 గ్రాములు
అల్లం వెల్లుల్లి ముద్ద... ఒకటిన్నర టీస్పూను
పచ్చిమిర్చి... ఐదు
మిరియాలపొడి... అర టీస్పూను
అల్లం... చిన్నముక్క
వెల్లుల్లి... 75 గ్రాములు
అజినమోటో... చిటికెడు
సోయాసాస్... 4 టీస్పూన్లు
కొత్తిమీర... 1 కట్ట
ఆయిల్... వేయించడానికి సరిపడా

తయారీ విధానం :
టిన్ మష్రూమ్స్ అయినట్లయితే నేరుగా వాడుకోవచ్చు. విడిగా కొన్నవాటినయితే కడిగి ఉడకబెట్టి ఒక బౌల్‌లో వేసి వాటికి మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరియాల పొడి, ఉప్పువేసి కలిపి ప్రక్కన ఉంచాలి. బాండీలో నూనె పోసి కాగిన తరువాత పకోడీలలాగా నూనెలో వేసి ఫ్రై చేయాలి.

ఒక బాండీలో 4 టీస్పూన్ల నూనెను వేసి కాగిన తరువాత సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి ఎర్రగా వేయించి అందులో వేయించిన మష్రూమ్స్ వేసి సోయాసాస్, ఒక కప్పు నీళ్ళు పోసి ఇగిరిపోయేంత వరకు డ్రైగా ఫ్రై చేయాలి. చివరగా కొత్తిమీర, అజినమోటో కలిపి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment