Friday, July 4, 2014

నేతి బీరకాయ పచ్చడి / సిల్క్ స్క్వాష్ (చైనీస్ ఓక్రా)

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • నేతి బీరకాయ................ఒకటి
  • చింతపండు......చిన్న ఉసిరికాయంత
  • పచ్చిమిరపకాయలు.........ఆరు
  • నూనె............తగినంత
  • ఉప్పు.............తగినంత
  • వెల్లుల్లి రెబ్బలు......నాలుగు
  • జీలకర్ర.......... ఒక చిన్న చెంచా
  • కొత్తిమీర..........చిన్న కట్ట
  • కరివేపాకు........రెండు రెమ్మలు

తయారీ విధానం

నేతి బీరకాయల తోలు తియ్యక్కరలేకుండా, కాయని బాగా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి. బాణెలిలో రెండు చెంచాల నూనె వేసి, అది వేడి అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించి తీసుకోవాలి.
తరువాత బీరకాయ ముక్కలు వేసి వాటిలో నీరు పోయేంతవరకు వేయించి తీసుకోవాలి. వేగాక ఈ ముక్కల్లో కాస్త చింతపండు పెట్టుకోవాలి. ముక్కలు చల్లారాక ముందుగా పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి. తరువాత నేతి బీరకాయ ముక్కలు వేసి ఒక్కసారి తిప్పీ తిప్పనట్టు తిప్పితే సరిపోతుంది.
చివరగా కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లియ, జీలకర్ర వేసి ఒక్కసారి కచ్చాపచ్చాగా నూరుకుని పచ్చట్లో కలుపుకోవాలి.
ఎండుమిరపకాయలు, మినపపప్పు, శనగపప్పు, ఆవాలతో పోపు పెట్టుకోవచ్చు కూడా.
వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యితో పాటు ఈ పచ్చడి వేసుకు తింటే అద్భుతంగా ఉంటుంది! చపాతీలలోకి కూడా బాగుంటుంది.

No comments:

Post a Comment