Wednesday, July 9, 2014

కాలీఫ్లవర్ సూప్


Cauliflower-soup
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ - 1, ఉల్లిగడ్డ - 1
బటర్ - 1 1/2 స్పూన్స్
పచ్చిమిరపకాయ - 1, అల్లం - చిన్న ముక్క
గోధుమ పిండి - ఒక స్పూన్, పాలు - ఒక కప్పు
ఉప్పు, మిరియాల పొడి - తగినంత

తయారు చేసే విధానం :
కాలీఫ్లవర్‌ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో బటర్ వేసి కరిగాక ఉల్లిపాయలను బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. దీంట్లో గోబీ ముక్కలు వేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలి. పదినిమిషాల తర్వాత గోధుమపిండి వేసి పాలు, కొన్ని నీళ్లు పోయాలి. ఇందులోనే అల్లం, పచ్చిమిరపకాయలను వేసి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. అవన్నీ బాగా మెత్తగా ఉడికేలా చేయాలి. ఐదు నిమిషాల తర్వాత కొన్ని పాలు, నీళ్ళు పోసి మరికాసేపు ఉడికించాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దించేయాలి. చివరగా మిరియాలపొడి వేసి సర్వ్ చేయాలి. 

No comments:

Post a Comment