Wednesday, July 9, 2014

క్యాప్సికమ్ తో సూప్ ...

Picture
కావలసిన పదార్థాలు :
ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు క్యాప్సికమ్ - ఒకటి,
చిన్న ఉల్లిపాయ - ఒకటి,
వెల్లుల్లి రెబ్బలు - రెండు,
టొమాటో - సగం,
పచ్చిమిర్చి - రెండు,
కొత్తిమీర తరుగు - గుప్పెడు,
చికెన్ లేదా కూరగాయలు ఉడికించిన నీళ్లు - రెండు కప్పులు,
మిరియాల పొడి - సరిపడా,
వేగించిన జీడిపప్పు పొడి - అర టీస్పూన్,
ఉప్పు - సరిపడా,
ఆలివ్ నూనె - రెండు టీస్పూన్లు,
మీగడ - అర కప్పు (అవసరమయితే).

తయారుచేసే పద్ధతి : 
ఒక గిన్నెలో నూనె వేడిచేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం వేగించాలి. తరువాత క్యాప్సికమ్, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి క్యాప్సికమ్ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించి మంట ఆపేయాలి. 

ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. దీన్ని వడకట్టి తొక్కలు తీసేయాలి. 
ఒక గిన్నెలో వడకట్టిన సూప్, చికెన్ లేదా కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి స్టవ్ వెలిగించాలి. 
దీనిలో ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేయాలి. సూప్ ఉడికేటప్పుడు మీగడ కలిపితే చిక్కగా అవుతుంది. లేదా నీళ్లు కలిపిన మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని అయినా కలపొచ్చు. ఐదు నిమిషాల తరువాత స్టవ్ ఆపేసి మీగడ, వేగించిన బ్రెడ్ ముక్కలు వేసుకుని వేడివేడిగా తాగితే సూపర్గా ఉంటుంది.

No comments:

Post a Comment