Tuesday, July 8, 2014

గుత్తి వంకాయ బజ్జీ

Picture
కావలసిన పదార్థాలు :
శెనగపిండి            - రెండు కప్పులు, 
బియ్యప్పిండి        - పావుకప్పు, 
వంటసోడా            - పావు టీస్పూన్, 
ఉల్లిపాయ             - ఒకటి, 
పచ్చిమిర్చి           - మూడు, 
కొత్తిమీర               -  కొద్దిగా  
అల్లం                   - చిన్న ముక్క, 
వెల్లుల్లి రెబ్బ         - ఒకటి, 
వంకాయలు         - మూడు, 
                                                            నూనె, ఉప్పు         -  సరిపడా.

తయారుచేసే పద్ధతి :
  • వంకాయల్ని నాలుగు భాగాలుగా కోయాలి( గుత్తి వంకాయ కూరకి కోసినట్టుగా). వాటిని నూనెలో వేసి సగం ఉడికించి పక్కన పెట్టాలి. 
  • ఆ తరువాత శెనగ, బియ్యప్పిండిలో నీళ్లు పోసి వంటసోడా, ఉప్పు వేసి చిక్కటి పేస్ట్‌లా కలపాలి. 
  • మిక్సీలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి మెత్తటి పేస్ట్‌లా చేయాలి. 
  • ఆ తరువాత సగం ఉడికిన వంకాయల్లో మిక్సీ చేసిన మసాలా పేస్ట్ కూరాలి. వీటిని బజ్జీ పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి మిర్చి బజ్జీకి వేగించినట్టుగానే వేగించాలి. వీటిని నచ్చిన చట్నీతో తినొచ్చు లేదా అన్నంలో కూరగా అయినా తినొచ్చు.

No comments:

Post a Comment