Wednesday, July 9, 2014

హాట్‌ అండ్‌ సోర్‌ వెజ్‌ సూప్‌


కావలసిన వస్తువులు...

క్యారెట్‌ తరుగు       - అర కప్పు
hot&sour-veg-soupబీన్స్‌ తరుగు      - అర కప్పు
కీర దోస తరుగు    - అర కప్పు
నీళ్ళు           - మూడు కప్పులు
పుట్టగొడుగుల తరుగు- అర కప్పు
పండుమిర్చి పేస్ట్‌   - అర టీ స్పూన్‌
కార్న్‌ఫ్లోర్‌        - 1 టీ స్పూన్‌
ఉప్పు          - తగినంత
మిరియాల పొడి    - చిటికెడు
నూనె           - 1 టీ స్పూన్‌
ఉల్లికాడల తరుగు   - పావు టీ స్పూన్‌
టొమోటో సాస్‌    - 1 టీ స్పూన్‌


తయారు చేసే విధానం...
సాస్‌ ప్యాన్‌లో నూనె వేడిచేసి క్యారెట్‌, బీన్స్‌, కీరదోస, పుట్టగొడుగుల తరుగు వేసి మగ్గనివ్వాలి. తరువాత కార్న్‌ ఫ్లోర్‌ కలిపి రెండు నిమిషాల తరువాత పండుమిర్చి పేస్ట్‌, మిరియాల పొడి, ఉల్లికాడల తరుగు, టొమోటో సాస్‌, ఉప్పు, నీళ్ళు కలిపి పది నిమిషాలు ఉడికించి స్టౌపై నుంచి దించేయాలి. కూరగాయలను ఒక్కొక్క టిగా తీసుకునేకన్నా ఇలా కొన్ని రకాలు కలిపి తీసుకోవడం వల్ల పోషక విలువలు సమృద్ధిగా పొందగలుగుతాము.

No comments:

Post a Comment