Tuesday, July 8, 2014

మ్యాంగో మూంగ్ దాల్

కావలసిన పదార్థాలు :

పెసర పప్పు         -           కప్పు
వేరుశనగపప్పు    -            పావుకప్పు
మామిడికాయ తురుము -    2 టీస్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము -       2 టీస్పూన్లు
కొత్తిమీర             -             కొద్దిగా
ఉప్పు                -             తగినంత
పచ్చిమిర్చి         -             రెండు (సన్నగా తరగాలి) 

తయారుచేసే పద్ధతి :

              ముందుగా పెసరపప్పు, వేరుశనగపప్పులను విడివిడిగా మూడు లేక నాలుగు గంటల పాటు నానపెట్టి నీళ్ళు వడకట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఈ పప్పులను, పచ్చిమిర్చి తరుగు, పచ్చి మామిడి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఐదు లేక ఆరు నిముషాలు నాననివ్వాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. (మామిడికాయ బదులు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు).

No comments:

Post a Comment