Sunday, July 6, 2014

ఉల్లిపాయ పచ్చడి


కావలసినవి
8-10 మీడియం సైజు ఉల్లిగడ్డలు
2-3 టీస్పూన్ల కారం
1 టీస్పూను మామిడికాయ పొడి
1 టీస్పూను ఆవాల పొడి
150 మి.లీ ఆవనూనె
ఉప్పు తగినంత.
తయారుచేసే విధానం :
ఉల్లిపాయల పొట్టు తీసుకుని పైభాగంలో నాలుగు భాగాలుగా కట్‌ చెయ్యాలి. వీటిపై ఉప్పు చల్లి ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి. తరువాత ఉల్లిగడ్డను కడిగా నీళ్లు లేకుండా తుడవాలి. అన్ని మసాలాలను కలుపుకుని దీన్ని ఉల్లిగడ్డల్లో నింపుకోవాలి.
ఆవనూనె పొగలు వచ్చేవరకు వేడిచేసి తిరిగి చల్లార్చాలి. ఉల్లిగడ్డల్ని ఒక సీసాలోకి తీసుకుని ఇందులో చల్లార్చిన ఆవనూనె పొయ్యాలి. దీన్ని రెండు రోజులు ఊరనిచ్చి తరువాత వాడుకుంటే రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment