Sunday, July 6, 2014

ఒరుగులు (కూరగాయలను ఎండబెట్టే పద్దతి)


అనేక రకాల కూరగాయలను పంటకాలంలో చౌకగా ఉన్నప్పుడు ఎండబెట్టి నిల్వచేసి సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు. ఈ ఎండపెట్టిన కూరగాయలు రుచిలోను పోషకవిలువలలోను, తాజా కూరగాయలకు ఏ మాత్రం తీసిపోవు. ఎండబెట్టి నిల్వచేసిన
కూరగాయలను వాడటానికి ముందు వాటిని ఒక రాత్రంతా నీటిలో నానబెట్టి లేదా 2గంటలు వేడినీటిలో నానబెట్టి వెలికి తీసి, తాజా కూరగాయలవలె వండుకోవచ్చు. ఇందుకోసం ఒక వంతు కూరగాయలకు మూడు వంతుల నీరు అవసరం ఉంటుంది.

పోషక పదార్ధాల సద్వినియోగానికి నానపెట్టిన నీటిలోనే కూరగాయలను ఉడికించడం శ్రేయస్కరం. ఒకవేళ వేపుడుకు వాడదలిస్తే నీటిలో నానపెట్టవలసిన అవసరం ఉండదు.
తయారీ: తాజా కూరగాయలను ముందుగా నీటిలో కడిగి శుభ్రపరిచి కావలసిన ఆకారంలో ముక్కలుగా కోయాలి. వీటిని ఒక పల్చటి బట్టలో కట్టి మరుగుతున్న నీటిలో రెండుమూడు నిమిషాలు ఉంచాలి. దీనినే బ్లాంచింగ్‌ ంటారు. ఇలా చేస్తే ముక్కలు గోధుమరంగుగా మారకుండా ఉంటాయి. తర్వాత ఆ ముక్కలను బయటకు తీసి అల్యూనిమియం ట్రేలో పలుచగా ఓక వరుసలో పరిచి పైన ఒక పలుని బట్ట కప్పి ఎండలోగాని, లేదా సోలార్‌ డ్రైయర్‌లో గాని ముక్కలు గలగలలాడేవరకు ఎండబెట్టాలి. వీటిని పాలిథీన్‌ సంచుల్లో నింపి సీలువేసి గాలి చొరబడకుండా సీసాల్లో గాని, డబ్బాల్లో గాని నింపి శీతల స్థలంలో భద్రపరచుకోవాలి.
చిక్కుడు, బెండ, మిరప, కాప్సికం. కాకర, క్యాబేజి, బఠాణి, గోరుచిక్కుడు, ఆకుకూరలను మరుగుతున్న నీటిలో మూడు నుండి 5నిమిషాలు ముంచి, తర్వాత 50నుండి 60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలోగాని, లేదా ఎండలో గాని గలగలలాడే వరకు ఎండబెట్టాలి.
వంకాయను కోసి 1శాతం పొటాషియం మెటాబైసల్ఫేట్‌లో 90నిమిషాలు ఉంచి తర్వాత మరుగుతున్న నీటిలో నాలుగు నిమిషాలు ఉంచి ఎండబెట్టాలి.
అలాగే క్యారెట్‌ను మరుగుతున్న 2శాతం ఉప్పు ద్రావణంలో 2నుంచి 4నిమిషాలు ముంచి ఉడకబెట్టాలి. కాలిఫ్లవర్‌ను ఎండబెట్టదలచినప్పుడు మరుగుతున్న నీటిలో నీటిలో నాలుగైదు నిమిషాలు ముంచిన తర్వాత 1శాతం పొటాషియం మెటాబైసల్ఫేట్‌లో ఒక గంట నానబెట్టి తర్వాత ఎండబెట్టాలి. ఉల్లిగడ్డలను ముక్కలుగా కోసిన తర్వాత 5శాతం ఉప్పు ద్రావణంలో పదినిమిషాలు ముంచి ఎండబెట్టవలసి ంటుంది. పూర్తిసైజుకు వచ్చిన గట్టి టమోటాలను ఎన్నుకుని మ రుగుతున్న నీటిలో సుమారు 60 సెకండ్లు ముంచి తర్వాత ముక్కలుగా చేసి ఎండబెట్టాలి.
అలాగే మామిడికాయలను ఎండబెట్టవలసివస్తే తొక్కతీసి మామిడి కాయలను 2శాతం ఉప్పు ద్రావణంలో పదినిమిషాలు ఉంచి ముంచి ముక్కలుగా కోసి 1శాతం పొటాషియం మెటాబైసల్ఫేట్‌లో సుమా పు మూడు గంటలు నానబెట్టి ఎండబెట్టాలి

No comments:

Post a Comment