Wednesday, July 9, 2014

రెడ్ సూప్ ( బీట్‌రూట్ సూప్)

రెడ్ సూప్
కావలసినవి: బీట్‌రూట్ (చెక్కు తీసి, తరిగి) - అరకప్పు, క్యారెట్ (చెక్కు తీసి తరిగి) పావుకప్పు, కాలీఫ్లవర్ తరుగు - పావు కప్పు.
తయారీ: బీట్‌రూట్, క్యారెట్, కాలీఫ్లవర్‌ల తరుగుని ప్రెషర్ కుక్కర్‌లో వేసి ఒక కప్పు నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారాక మెత్తటి గుజ్జులా చేసి వడకట్టాలి. దీన్ని మళ్లీ ఒకసారి వేడిచేసి తాగాలి.
టిప్: ఆరు నెలలు దాటని పిల్లలకి తాగించేట్టయితేనే దీన్ని వడకట్టాలి. ఆరు నెలలు దాటిన పిల్లలకు వడకట్టకుండానే ఈ సూప్ తాగించొచ్చు.

No comments:

Post a Comment