Wednesday, July 9, 2014

పెసర సూప్

పెసర సూప్

కావలసినవి: పెసలు - పావుకప్పు, నూనె - ఒక టీస్పూన్, జీలకర్ర - పావు టీస్పూన్, కరివేపాకులు - కొన్ని, ఇంగువ - పావు టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మరసం - రెండు టీస్పూన్లు.
అలంకరణకు: కొత్తిమీర తరుగు - రెండు టీస్పూన్లు.
తయారీ: పెసలు శుభ్రం చేసి కడిగాక నాలుగన్నర కప్పుల నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్‌లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. వేరే గిన్నెలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకులు, ఇంగువ, ఉడికించిన పెసలు వేసి మళ్లీ ఒకసారి ఉడికించాలి. ఒక ఉడుకు వచ్చాక ఉప్పు వేసి బాగా కలిపి నాలుగు నిమిషాల తరువాత నిమ్మరసం కలపాలి. ఈ సూప్‌ని సర్వింగ్ గిన్నెలోకి తీసి కొత్తిమీర తరుగుతో అలంకరించాలి. వేడివేడిగా తాగితే ఈ సూప్ రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.

No comments:

Post a Comment