Wednesday, July 9, 2014

కార్న్ సూప్

మొక్కజొన్న మన ఆహారంలో తరచూ ఉఫయోగిండం వల్ల  మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడంలోనూ, మూత్ర సంబంధ సమస్యలు రాకుండా నిరోధిస్తుంధి. మరి ఇవాళ కార్న్ లేదా మొక్కజొన్నతో చాలా సులువైన సూప్ చేసుకుందాం
కావలసిన వస్తువులు:
మొక్కజొన్న గింజలు  -1 కప్పు
కార్న్ ఫ్లోర్ – 2 tsp
మిరియాల  పొడి – 1/4 tsp
అజినొమొటొ -చిటికెడు
ఉప్పు -తగినంత
సోయా సాస్ – 1/2 tsp
ఉల్లిపొరక – 1 tsp

లేత మొక్కజొన్న గింజలను మూడు కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. వేరొక గిన్నెలో కార్న్ ఫ్లోర్, అజినొమొటొ, ఉప్పు, సోయా సాస్ తీసుకుని అందులో అరకప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా  కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కార్న్ లో వేయాలి.  ఉండలు కట్టకుండా  కలుపుతూ చిక్కబడ్డాక  మిరియాల పొడి కలపి దింపేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపొరక ఆకు లేదా కొత్తిమిర చల్లి సర్వ్ చేయాలి. అంతే..

No comments:

Post a Comment