Wednesday, July 9, 2014

గార్లిక్ వెజిటబుల్ సూప్

గార్లిక్ వెజిటబుల్ సూప్

కావలసినవి: క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, కాలీఫ్లవర్, బఠాణీలు, బేబీకార్న్ (తరిగిన ముక్కలు) - ఒక కప్పు, వెల్లుల్లి (సన్నగా తరిగి) - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ (సన్నగా తరిగి) - పావుకప్పు, ఓట్స్ - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా
అలంకరణకు: కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు
తయారీ: కళాయిలో నూనె వేడిచేసి ఉల్లి, వెల్లుల్లి తరుగు వేగించాక కూరగాయ ముక్కలు వేసి కొన్ని నిమిషాలు వేగించాలి. తరువాత రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి ఒక ఉడుకు వచ్చాక మంటతగ్గించి కూరగాయ ముక్కలు ఉడికేదాకా ఉంచి ఓట్స్ వేసి మరో ఐదు నిమిషాలు స్టవ్ మీదే ఉంచాలి. కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా తాగితే బాగుంటుంది.

No comments:

Post a Comment