Monday, July 7, 2014

ఆలూ టిక్కా

Picture
కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - 3
క్యారెట్‌, బీన్స్‌
క్యాలీఫ్లవర్‌ - 100 గ్రాములు
జీలకర్ర - 1 టీ స్పూన్‌, 

మిరియాల పొడి - పావు టీ స్పూన్‌
పసుపు - అర టీ స్పూన్‌, 

అల్లం - 50 గ్రాములు
చాట్‌ మసాలా - పావు టీ స్పూన్‌
కొత్తిమీర - 1 కట్ట, 

పుదీనా - 1 కట్ట
ఉప్పు - సరిపడా, 

కారం - తగినంత, 
నూనె - తగినంత

తయారీ విధానం
  •  బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మెదపాలి.
  • క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌లను ఉడికించి వడగట్టి బంగాళ దుంప ముద్దలో కలపాలి.
  • అందులో జీలకర్ర, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం, కొత్తిమీర, పుదీనా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి కొద్దిగా అదమాలి.
  • వీటిని పెనంమీద నూనెతో కాల్చుకుని పైన చాట్‌ మసాలా చల్లాలి.

No comments:

Post a Comment