Tuesday, July 8, 2014

బ్రెడ్ బజ్జీ

Picture
కావలసిన పదార్థాలు : 
బ్రెడ్ స్లయిస్‌లు        - నాలుగు, 
శెనగపిండి              - ఒక కప్పు, 
జీలకర్ర                   - ఒక టీ స్పూన్, 
కారం                      - అర టీస్పూన్, 
నూనె                     - వేగించడానికి సరిపడా, 
ఉప్పు                     - రుచికి సరిపడా, 
వంటసోడా               - చిటికెడు.



తయారుచేసే పద్ధతి :
  • ఒక గిన్నెలో శెనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, వంటసోడా వేసుకుని నీళ్లు, రెండు స్పూన్ల వేడి నూనె వేసి ఉండలు కట్టకుండా మెత్తటి పేస్ట్‌లా కలపాలి. 
  • తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. అది వేడెక్కేలోగా ఒక్కో బ్రెడ్‌ను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్ని శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఈ వేడి వేడి బ్రెడ్ బజ్జీలను సాస్ లేదా చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment